Tuesday, 3 November 2026

రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై సమాధానం చెప్పాలి… -సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి

హన్మకొండ ప్రతినిది జూన్ 30 జనంసాక్షికేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి విభజన హామీలలో ఒకటైన కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీనీ ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందని,ప్రజలకు జవాబు చెప్పవలసిన బాధ్యత కేంద్రంపై ఉందని సిపిఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి అన్నారు.తెలంగాణ రాష్ట్రానికి విభజన హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేని,ప్రధాని నరేంద్ర మోడీ ఈ ప్రాంత ప్రజలకు వరప్రసాదమైన కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ,బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ,గిరిజన యూనివర్సిటీవై ప్రకటన చేసి వెంటనే ఈ ప్రాంతానికి ఉపయోగపడేలా చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రే బిక్షపతి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాజీపేట మండలం సిపిఐ సమితి సమావేశం మాలోతు శంకర్ నాయక్ అధ్యక్షతన శుక్రవారం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రే బిక్షపతి హాజరై మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి నపుడు విభజన పార్లమెంట్ చట్టంలో పొందుపరిచిన అంశాలు కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ములుగులో గిరిజన యూనివర్సిటీ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి తదితర అంశాలను కేంద్రం పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ఈ ప్రాంతంలో ఉన్నత చదువులు చదివి యువతకు ఉపాధి లేక ఇతర దేశాలకు ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారని,దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కొరకు ఎదురు చూస్తున్నారని,కానీ ఈ ప్రాంత ప్రజలను మభ్య పెట్టడంలోనే కేంద్రం కాలం వెల్లదీస్తుందని,ప్రధాని నరేంద్ర మోడీ హనుమకొండ లో జరిగే బిజెపి కార్యకర్తల సమావేశానికి హాజరయ్యే ముందు ఈ ప్రాంత వరప్రసాదమైన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని స్పష్టంగా తెలియ చేయాలని సిపిఐ హనుమకొండ జిల్లా సమితి డిమాండ్ చేస్తున్నదని అన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్,మండల కార్యదర్శి మునగాల బిక్షపతి, జిల్లా కార్యవర్గ సభ్యులు కరే లక్ష్మణ్.,ఈగ లావణ్య .బొట్టు బిక్షపతి .రోజా రాణి .రజిత.. మునగాల ఐలయ్య. స్వామి నారు తదితరులు పాల్గొన్నారు