ఏటూరు నాగారం (జనం సాక్షి);జూన్ 30.ఏటూరు నాగారం మండలం సీనియర్ నాయకుడు పోగుల లక్ష్మీనారాయణ 2013 లో దివంగత పొలిట్‌బ్యూరో సభ్యుడు అజ్మీరచందూలాల్ సమక్షంలో పార్టీలో చేరారు. 2013లో తొలి టీఆర్‌ఎస్ బలపర్చిన ఏటూరునాగారం సర్పంచ్ అభ్యర్థిగా పోగుల కళావతి లక్ష్మినారాయణనును పార్టీని వీడడం గమనార్హం. పార్టీ నాయకులు సరైన మద్దతు ఇవ్వకపోవడంతో ఓడిపోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి గుర్తింపు లేదు. పద్మశాలి సంఘం, రామాలయం, బోనాలు, బతుకమ్మ, గ్రామంలో జరిగే ప్రతి ఉత్సవాలలో తనదైన శైలిలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేస్తుంటాడు. 12 సంవత్సరాలు రామాలయం ఆలయ కమిటీ చైర్మన్‌గా పనిచేసి అభివృద్ధిలోకి తీసుకువచ్చారు. ప్రజాక్షేత్రంలో ఉన్న తనకు ఎలాంటి ఆదరణలేకపోవడంతోనే బీఆర్‌ఎస్ పార్టీ నుంచి వీడిపోతున్నట్లు సమాచారం.
––– కాంగ్రెస్ గూటికి ?
బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిదులు సరైన గుర్తింపు ఇవ్వకపోవడంతో పోగుల లక్ష్మినారాయణ బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లోకి చేరే అవకాశాలున్నట్లు సమాచారం. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కూడా సంప్రదింపులు చేసినట్లు తెలుస్తోంది.
బీఆర్‌ఎస్ పార్టీలో సరైన గుర్తింపు లేక పార్టీని వీడితున్నట్లు బీఆర్‌ఎస్ మండల నాయకుడు పోగుల లక్ష్మినారాయణ




