హైదరాబాద్: రైల్వే బడ్జెట్ వాస్తవానికి దగ్గర ఉందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. బడ్జెట్‌లో భద్రత, శుభ్రత, స్వచ్ఛతకు పెద్దపీట వేసినట్టు పేర్కొన్నారు. ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ బడ్జెట్ ప్రభావం ఒకటి రెండు ఏళ్లలో తెలుస్తుందన్నారు. ప్రభుత్వానిది ఒకే మతమని, అది అభివృద్ధి మతమని అన్నారు. ఎనిమిది శాతం అభివృద్ధి చెందనున్నట్టు ఎకనమిక్ సర్వే వెల్లడించిందన్నారు. గత ప్రభుత్వాలు బడ్జెట్‌లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే మరో 40 ఏళ్లు పడుతుందని ఆయన ఎద్దేవా చేశారు. ప్రస్తుత సమావేశాల్లో ఆరు ఆర్డినెన్స్‌లపై చర్చించామని, ఆర్డినెన్స్‌లు జారీ చేశాక చేపట్టే కార్యక్రమాలు చట్టబద్ధమేనని మంత్రి తెలిపారు. భూ సేకరణలో మార్పులు తీసుకురావాలని ప్రధాని అధ్యక్షతన జరిగిన సీఎంల సమావేశంలో నిర్ణయించినట్టు వెంకయ్యనాయుడు తెలిపారు.




