Wednesday, 4 November 2026

రైల్వే సమస్యలపై చైర్మన్ కు వినతి

రైల్వే సమస్యలపై చైర్మన్ కు వినతి.
ఫొటో : వినతి పత్రాన్ని అందజేస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే.
బెల్లంపల్లి, డిసెంబర్ 15, (జనంసాక్షి )
బెల్లంపల్లి నియోజకవర్గంలో ఉన్న రైల్వే సంబంధిత సమస్యలపై గురువారం పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఇండియన్ రైల్వేస్ చైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వినయ్ కుమార్ త్రిపాఠిని కలిసి పలు సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాన్ని అందజేశారు. తాండూర్ మండలం రేచిని రోడ్ రైల్వే స్టేషన్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేయాలని, బెల్లంపల్లి రాం నగర్ వద్ద అండర్ బ్రిడ్జి నిర్మాణం చేయాలని, నియోజకవర్గ ప్రజల సౌకర్యార్థం బెల్లంపల్లి రైల్వేస్టేషన్ లో గ్రాండ్ ట్రంక్ సూపర్ ఫాస్ట్ ఎక్ష్ప్రెస్స్, దక్షిణ్ సూపర్ ఫాస్ట్ ఎక్ష్ప్రెస్స్, రాయ్ పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్ష్ప్రెస్స్ రైళ్ళను నిలుపుదల చేయాలని వినతి పత్రంలో కోరారు. వినతి పత్రంలో పేర్కొన్న సమస్యలపై చైర్మన్ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తెలిపారు.