Thursday, 5 November 2026

రైస్ మిల్లర్ల దోపిడీని అరికట్టాలని రైతుల ధర్నా

రైస్ మిల్లర్ల దోపిడీని అరికట్టాలని రైతుల ధర్నా*
మెట్పల్లి టౌన్, డిసెంబర్ 06, జనంసాక్షి:
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం చౌలమద్ది గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ రైతులు ఆందోళనకు దిగారు జగిత్యాల-నిజామాబాద్ జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు.
ఒక బస్తాకు 40 కిలోల 600 గ్రాములు తూకం వేయవలసి ఉండగా రైస్ మిల్లర్లు 42 కిలోల 500 గ్రాములు తూకం వేస్తున్నారని రైస్ మిల్లర్ల దోపిడీని అరికట్టాలని వారు డిమాండ్ చేశారు.అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీవోకు వినతిపత్రం అందించారు.
ఈ కార్యక్రమంలో రాజేశ్వర్ రెడ్డి, గంగాధర్, శీను, ఎం గంగారం, రంజిత్, జలపతి రెడ్డి, చిన్నారెడ్డి, చౌలమద్ధి గ్రామ రైతు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు