Tuesday, 3 November 2026

రోగులకు పండ్లు పంపిణీ చేసిన సమతా సైనిక్ దళ్ నాయకులు

రోగులకు పండ్లు పంపిణీ చేసిన సమతా సైనిక్ దళ్ నాయకులు
జహీరాబాద్ డిసెంబర్ 1( జనం సాక్షి)సమతా సైనిక్ దళ్ జహీరాబాద్ డివిజన్ అధ్యక్షులు కర్ణం రవి ఆధ్వర్యంలో ధీర వనిత ఈశ్వర్ భాయ్ జయంతి ని నిర్వహించారు.ఈశ్వరి భాయ్ జయంతి సందర్భంగా జహీరాబాద్ ఏరియా హాస్పిటల్ లో రోగులకు పండ్ల పంపిణీ చేసి ఈశ్వరి భాయ్ తన జీవితకాలంలో అనుభవించిన కష్టాలను, స్త్రీలకు చేసిన సేవలను, అంబేద్కర్ ఆలోచన విధానమైనటువంటి షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్, రిపబ్లికాన్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎన్నికయి సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపై నిండు అసెంబ్లీలోనే నిలదీసిన నేత అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాల రాజ్, నవీన్, నర్సింలు, ప్రతాప్, శ్రీనివాస్, ప్రేమ్ కుమార్, జైపాల్, కిట్టు, ఇతరులు పాల్గొన్నారు.