బడుగువర్గాల అభ్యున్నతికి ఈశ్వరీబాయి కృషి
జహీరాబాద్ డిసెంబర్ 1 (జనం సాక్షి) బడుగువర్గాల అభ్యున్నతికి ఈశ్వరీబాయి కృషి చేశారు అని, వారి సేవలు మరవరానివాని అని ఆర్ పి ఐ పార్టీ జహీరాబాద్ ఇంచార్జ్ రాములు పేర్కొన్నారు
గురువారం ఆమె జయంతి ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
భారతీయ రిపబ్లికన్ పార్టీ నాయకురాలు, అంబేద్కరువాది, దళిత సంక్షేమకర్త, సామాజిక
ఉద్యమకారిణి ఈశ్వరి భాయి
1952 నుండి 1990 వరకు నాలుగు దశాబ్దాలకు పైగా ప్రజాసేవా చేశారన్నారు.1969లో మొదలైన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం తొలిదశ పోరాటంలో వీరి కృషి మరవలేనిది అన్నారు.ఈశ్వరీబాయి కొంతకాలం మహిళా, శిశు సంక్షేమ బోర్డుకు అధ్యక్షురాలిగా ఉన్నారు. మహిళాభ్యుదయానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి వాటిని అమలు జరిపారు అని,
మున్సిపల్ కౌన్సిలర్‌గా, షెడ్యూల్ కులాల ఫెడరేషన్ కార్యదర్శిగా, ఎమ్మెల్యే గా వారు అనేక బాధ్యతలను ప్రజల కోసం నిర్వహించారని ఈశ్వరిభాయి జీవితం మొత్తం పోరాటమే అని, వ్యక్తిగతంగా జీవితంలో , సామాజిక పోరాటంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని పోరాడారు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సిద్ధ రెడ్డి ,రాములు జయప్పా వివిధ నాయకులు పాల్గొన్నారు
బడుగువర్గాల అభ్యున్నతికి ఈశ్వరీబాయి కృషి




