Thursday, 5 November 2026

రోడ్డుపై భారీ గోతులు.. వణికిపోతున్న వాహనదారులు

గంగారం జూన్ 12 (జనం సాక్షి)గంగారం మండలంలోని
రహదారుల పరిస్థితికి.. ఈ రోడ్డు అద్దం పడుతోంది. భారీ గుంతతో అధ్వాన్నంగా ఉండటంతో.. దీనిపై వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా.. అధికారులు స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.కాటినగర్ మూలమలుపు వద్ద భారీ గుంత ఏర్పడి వాహనదారులు తీర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ విధంగానే అధికారులు నిర్లక్ష్యం వహిస్తే వాహనదారులప్రాణాలకేప్రమాదంజరుగుతుందని అన్నారు. స్థానికులు రోడ్డు మరమ్మతులు చేయించాలని ఇప్పటికే పదుల సంఖ్యలో వాహనదారులు కింద పడ్డ సంఘటనలు స్థానికులు చూసామన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు రోడ్డుపై ఉన్న భారీ గుంతను మరమ్మతులు చేయించి వాహనదారుల ను రక్షించాలని స్థానికులు వేడుకున్నారు