Thursday, 5 November 2026

గంగారం మండలం లో ఉపాధి హామీ లో జరిగిన అవినీతి పైన విచారణ చేయాలి. తుడుందెబ్బ డిమాండ్

గంగారం జూన్ 12 (జనం సాక్షి)గంగారం మండలం లోని వివిధ గ్రామపంచాయితీ ల పరిధిల లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం ద్వారా జరిగిన 100రోజుల పనిలో అంతు లేని అవినీతి జరిగిందని ఈ అవినీతి అక్రమాల పైన విచార్ణ చేపట్టాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ డిమాండ్ చేస్తుంది గంగారం మండలంలో ఉపాధిహామీ పనులను చేపట్టిన అధికారులు లబ్ది దారులకు డబ్బులు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉపాధిహామీ పధకం అధికారులు గత కొన్ని రోజులుగా సోషల్ ఆడిట్ ను గ్రామపంచాయితీ ల వారీగా కొంతమంది ప్రయివేట్ సిబ్బందిని పుర్మాయించి ఉపాధి పనులలో ఎలాంటి సమశ్యలు లేనట్లుగా ఉపాధి పనులు చేసే వారి వద్దకు వెళ్లి లబ్ధిదారులు అందరికి చేసిన పనులకుగాను డబ్బులు ముట్టినట్లుగా వారు తీసుకునట్లుగా సంతకాలు చేయించుకోవడం జరిగిందని మండలం లో సగానికి పైబడిన కూలీ లకు డబ్బులు అందకపోయినా సంతకాలు చేయకుంటే మీ జాబ్ కార్డు రద్దు అవుతుందని బయపెడుతూ బలవంతం గా సంతకాలు చేయించుకున్నారని ఇందుకు పంచాయితీ కార్యదర్శుల పాత్ర కీలకంగా ఉందని వారు ఉపాధిహామీ అధికారులతో కుమ్మక్కయి పంచాయితీ లలో అవినీతికి ఆజ్యం పోస్తూ ప్రధాన భూమిక పోషిస్తున్నారని సోమవారం రోజున అన్నీ గ్రామ పంచాయితీ లలో గ్రామసభల ను తూ తూ మంత్రంగా నిర్వహిoచ్చారని అందులో ఎలాంటి అవినీతి అక్రమాలు జరుగ నట్లుగా తీర్మానాలు చేయించి మండల సభ నిర్వహణ కోసం తేదీనికూడ నియమించడం జరిగిందని తక్షణమే గంగారం మండలంలో ని జాతీయఉపాధి హామీ పధకం లో జరిగిన అవినీతి అక్రమాల పై విచార్ణ చేపట్టి ఉపాధి హామీ పనులను చేసిన కూలీలకు డబ్బులు చెల్లించే విధంగా చూడాలని లేని పక్షంలో జిల్లా కలెక్టర్ గారి దృష్టి కి సమస్య ను తీసుకెళ్లి అవినీతి కి కారకులైన అధికారుల పైన పిర్యాదు చేస్తామని రాష్ట్ర తుడుందెబ్బ సాంస్కృతిక కార్యదర్శి ఆగబోయిన రవి హెచ్చరించారు కార్యక్రమం లో జిల్లా కార్యదర్శి పడిగే మంగయ్య, పెనుక వెంకన్న, సోలం రాకేష్,ఇరుప సాగర్, కొమ్మయ్య,తాటి సునీల్, బచ్చేలా సంబశివారావు లు పాల్గొన్నారు