Thursday, 5 November 2026

రోడ్డు నిర్మాణానికి రూ.1.18 కోట్లు మంజూరు

సిరికొండ: మండలంలోని పెద్దవాల్గోడు గ్రామ పరిధిలోని బోడగుట్టపై వెలిసిన అన్నపూర్ణ దేవి ఆలయం వరకు సీసీ రోడ్డు, కల్వర్టుల నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.18 కోట్లు మంజూరు చేసిందని ఆలయ కమిటీ ఛైర్మన్‌ నారబోయిన శ్రీనివాస్‌ తెలిపారు. పంచాయతీ రాజ్‌ గ్రామీణాభివృద్ధి పథకం, ఎన్‌ఆర్‌ఈజీఎన్‌ పథకాల కింద ఈ నిధులు మంజూరైనట్లు ఆయన తెలిపారు. ఆలయ సమీపంలోని ఆర్‌ అండ్‌ బి రోడ్డు నుంచి బోడగుట్టపై వరకు ఈ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *