Wednesday, 4 November 2026

రోడ్డు ప్రమాదంలో ఇద్దరుమృతి, మరో ఇద్దరికి గాయాలు

నిజామాబాద్‌, జనవరి 28 (: జాతీయ రహదారి 44పై  ఆదివారం రాత్రి జరిగిన రోడు ్డ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. కామరెడ్డి మండలం, టెక్రీయాల్‌ స్టేజి వద్ద ఆగిఉన్న లారీని నిజామాబాద్‌నుంచి హైదరాబాద్‌ వెళుతున్న కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ సంఘటనలో కమ్మరిపల్లి మండలం, ఉప్పులూరు గ్రామానికి చెందిన తిరుపతి ప్రవీణ్‌ అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.  మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారిద్దరిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ మనోహర్‌ సిఐ హరికుమార్‌ సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *