Tuesday, 3 November 2026

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి

పెన్‌పహాడ్: వేగంగా వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టిన ఘటనలో ఆటోలో ఉన్న ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా పెన్‌పహాడ్ మండలం సింగరెడ్డిపాలెం వద్ద ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సూర్యాపేట నుంచి వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది.ఈ ఘటనలో ఆటోలో ఉన్న శ్రీశైలం(32), భువనగిరి అంజయ్య(50) అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు ఆత్మకూరు ఎస్ మండలం కందగడ్ల గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *