Wednesday, 4 November 2026

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

 

 

 

 

 

గుడిహత్నూర్: ఏప్రిల్, 25( జనం సాక్షి)మండలంలోని సీతగొంది గ్రామంలో రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు ఎస్ఐ. ప్రవీణ్ తెలిపారు.ఆయన తెలిపినవివరాల ప్రకారం సితాగోంది గ్రామానికి చెందిన రాధరపు హన్మండ్లు  అనే వ్యక్తి సోమవారం రాత్రి నేషనల్ హైవే 44 రోడ్డు దాటుతుండగా గుడిహత్నూర్  వైపు నుండి అదిలాబాద్ వైపు వెళ్తున్న  మోటార్ సైకిల్  ఢీ కొట్టడంతో రాధరపు హన్మండ్లు  తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ లో రిమ్స్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ  మృతి చెందాడు.కుటుంబ సభ్యుల ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ పేర్కొన్నారు .