రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
గోపాల్ పేట్ జనం సాక్షి నవంబర్ (26): రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని బుద్ధారం గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది ఎస్సై కథనం మేరకు బుద్ధారం గ్రామానికి చెందిన తోళ్ళ శ్రీహరి (22) తోళ్ల సాయి ఇద్దరూ సొంత పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై వనపర్తికి వెళ్లి వస్తుండగా బుద్ధారం గ్రామంలోని రైతు వేదిక వద్ద గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది దీంతో తోళ్ళ శ్రీహరి అక్కడికక్కడే మృతి చెందాడు తోళ్ల సాయి కి తీవ్ర గాయాలు అయ్యాయి సాయిని వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు పంపించినట్లు ఎస్సై నవీద్ తెలిపారు




