బిఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో పిల్లుట్లు శ్రీనివాస్ జన్మదిన వేడుకలు

బిఎస్పీ పార్టీ సూర్యాపేట జిల్లా ఇంఛార్జి పిల్లుట్ల శ్రీనివాస్ జన్మదిన వేడుకలను మండల పరిధిలోని తాడ్వాయి గ్రామంలో బిఎస్పీ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిఎస్పీ పార్టీ కోదాడ నియోజకవర్గ ఈసీ మెంబర్ కోట మన్మధుడు మాట్లాడుతూ, గ్రామంలో బిఎస్పీ పార్టీ నుంచి బలోపేతం చేసి రాబోయే కోదాడ నియోజకవర్గ ‌ఎన్నికల్లో బిఎస్పీ పార్టీ జెండా ఎగురువేయటమే శీనన్నకు మనమిచ్చే జన్మదిన వేడుకల బహుమతి అని అన్నారు‌. గ్రామంలో అందరూ కుల మతాలకు అతీతంగా బహుజన రాజ్యం స్ధాపనకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఎస్పీ పార్టీ కోదాడ నియోజకవర్గ నాయకులు జిల్లెపల్లి సుమన్, శోభన్, కోల సాయి, జ్యోతిబస్, కోట జానయ్య, ఆదూరి హిమంత్, మాతంగి నాని, కోట గోపి తదితరులు పాల్గొన్నారు.