Friday, 6 November 2026

రోడ్డు ప్రమాదం ఒకరు మృతి – ఇద్దరికీ తీవ్ర గాయాలు

జనంసాక్షి, మంథని : రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందగా ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం మంథని మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన రాపాక మధుకర్ (32) తన భార్య రాపాక సౌజన్య (28), తన బాబాయ్ కుమారుడు రాపాక యశ్వంత్ (10) లతో కలిసి భూపాలపల్లి జిల్లా గొర్లవీడు గ్రామానికి శుభకార్యానికి వెళుతూ మంథని మండలం బట్టుపల్లి గ్రామం వద్ద జరిగిన ప్రమాదంలో రాపాక సౌజన్య అక్కడికక్కడే మృతి చెందగా, రాపాక మధుకర్ కాలు విరుగగా, యశ్వంత్ చెయ్యి విరిగి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాపాక మధుకర్ ద్విచక్ర వాహనంపై భూపాలపల్లి వైపు వెళ్తుండగా, మంథని నుండి భూపాలపల్లి వైపు వెళ్తున్న బస్సును ఢీకొనగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి అటుగా నుండి మంథని వైపు వస్తున్న లారీకి ద్విచక్ర వాహనం బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు వివరించారు. ప్రమాదంలో గాయపడిన మధుకర్ యశ్వంతులను ప్రాథమిక చికిత్స నిమిత్తం స్థానికులు దగ్గరుండి మంథని ప్రభుత్వాసుపత్రికి 108 లో తరలించారు. విషయం తెలుసుకున్న మంథని పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.