జుక్కల్, ఎప్రిల్ 13, (జనంసాక్షి),కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని పెద్ద కొడప్ గల్ మండలం పరిధిలోని కౌలాస్ ఎల్లమ్మ దేవాలయానికి వెళ్ళే దారిలో జాతీయ రహాదారి(161) పై స్ధానిక ఎస్సై కోనారెడ్డి గురువారం మిర్రర్ ఏర్పాటు చేశారు.ఈ సంధర్బంగా ఎస్సై మాట్లాడుతూ ఈ స్థలంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ప్రమాదాల నివారణకు మిర్రర్ ఏర్పాటు చేశామని ఎస్సై తెలిపారు.





