Thursday, 5 November 2026

సబ్సిడీ పై గడ్డి విత్తనాలు పంపిణీ

 

 

 

 

 

జుక్కల్, ఎప్రిల్ 13,(జనంసాక్షి),కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లోని మద్నూర్ మండల కేంద్రంలో గల ప్రాథమిక పశువైద్య కేంద్రంలో గురువారం పశుపోషకులకు సబ్సిడీ పై గడ్డి విత్తనాలు అందజేశారు.ఈ సంధర్బంగా పశువైద్య సంచాలకులు డాక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతు 5కిలోల గడ్డి విత్తనాల సంచి ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడి పోను అరవై రూపాయలకే పశుపోషకులకు అందజేస్తున్నామని తెలిపారు.ఇంకా గడ్డి విత్తనాలు పశు వైద్య కేంద్రంలో అందుబాటులో ఉంటాయని,
పశు పోషకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దరావత్ సురేశ్, స్ధానిక పశు వైద్యాదికారి డాక్టర్ బి. విజయ్, పశువైద్య సిబ్బంది, రైతులు,నాయకులు పాల్గొన్నారు.