Thursday, 5 November 2026

రోడ్లపై చెత్త వేస్తే చర్యలు -కలెక్టర్ శశాంక

రోడ్లపై చెత్త వేస్తే చర్యలు
-కలెక్టర్ శశాంక

మహబూబాబాద్ బ్యూరో-నవంబర్ 17(జనంసాక్షి)

రోడ్లపై చెత్త వేస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ శశాంక హెచ్చరించారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని సీఎం రాకల పురస్కరించుకొని ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఐ డి ఓ సి, ఫ్లై ఓవర్ బ్రిడ్జి, బంధం చెరువు, మూడు కోట్ల సెంటర్ ప్రాంతాలను మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి , అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి కలెక్టర్ పనులను పర్యవేక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ రోడ్లు పరిశుభ్రంగా కనిపించాలని ప్లాంటేషన్ అందంగా కనిపించాలని అధికారులకు సూచించారు రోడ్లకు ఇరువైపులా ఉన్న మట్టి రోడ్లపైకి రాకూడదని అందుకు తగినట్లుగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రక్కనే ఉన్న చెత్త చెదారాన్ని తొలగించే ప్రక్రియను కలెక్టర్ పరిశీలిస్తూ చెట్లను పూర్తిగా తొలగించాలని సూచించారు తొలగించిన చెత్తను ఎప్పటికప్పుడు డంపింగ్ యార్డ్ కి తరలించాలన్నారు. అనంతరం ఫ్లై ఓవర్ బ్రిడ్జి ఫుట్పాత్ పనులను పర్యవేక్షించారు రోడ్ల పైన ఉన్న మట్టిని ట్రాక్టర్లు చేత తరలించాలన్నారు. ఫుట్ పాత్ లో టైల్స్ వేయించాలని అందంగా కనిపించాలన్నారు. బంధం చెరువు పరిశీలించి ముళ్ళ కంప, వయ్యారి భామ వంటి పిచ్చి చెట్లను పూర్తిగా తొలగించాలన్నారు. మొక్కలు నాటేటప్పుడు రోడ్డు నుండి ప్రక్కన వాహనం ఆగే అంత స్థలము చూసుకుని మొక్కలు నాటాలన్నారు. రోడ్లపై ఇసుక, కంకర, ఇటుక, మట్టి వంటివి పోస్తే ట్రాక్టర్ల చేత తరలిస్తూ సంబంధిత వ్యక్తులకు జరిమానా విధిస్తామని తెలియజేశారు. మూడు కోట్ల సెంటర్ వద్ద డివైడర్ లో నాటిన మొక్కలను పరిశీలించారు మొక్కలు చూపర్లకు అందంగా కనిపించాలని తెలియజేశారు. కలెక్టర్ వెంట మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, ఆర్ అండ్ బి ఈ ఈ తానేశ్వర్, డి ఈ రాజేందర్, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి, మున్సిపల్ డి ఈ ఉపేందర్, ఉద్యాన శాఖ అధికారి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.