Thursday, 5 November 2026

కారు దిగిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్

కారు దిగిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్

-ఉద్యమకారులను గుర్తించని ఎమ్మెల్యే

-టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన నాగేశ్వరరావు

మహబూబాబాద్ బ్యూరో-నవంబర్17(జనంసాక్షి)

 

మలిదశ ఉద్యమకారుడు ఇల్లందు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్య నాగేశ్వరరావు గురువారం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్, జిల్లా పార్టీ అధ్యక్షురాలు మలోత్ కవితకు లేఖ పంపించారు. 2001నుండి మలిదశ ఉద్యమంలో పార్టీ జెండాను భుజాలపై మోస్తూ ఎన్నో కేసులపాలై, లాఠీ దెబ్బలను తిని ప్రాణాలను పణంగా పెట్టి ఎందరో ఉద్యమకారులను తయారు చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయిలో కీలకపాత్ర పోషించిన నాగేశ్వరరావుకు పార్టీలో గౌరవం లేదని, ప్రస్తుత ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఏకపక్ష పాత్ర పోషించుతూ గ్రూపు రాజకీయాలు చేస్తూ ఉద్యమకారులను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని నాగేశ్వరరావు ఆరోపించారు. ఉద్యమ సమయంలో సెల్ఫోన్ టవర్ ఎక్కి నిరసనలు చేసి బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్న సమయంలో తన కుడి మొక్కలకు తీవ్ర గాయమై ప్రాణాపాయం నుండి బయట పడినా రాష్ట్ర సాధనే ద్యేయంగా పార్టీ జెండాను విడవకుండా కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర సాధనలో కృషి చేసిన ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి కారు ఎక్కిన హరిప్రియ కారును కాళీ చేయడానికే గ్రూపు రాజకీయాలు చేస్తున్నారని ఉద్యమకారులను గుర్తించకపోవడమే కాక ఎమ్మెల్యే తన భర్త హర్సింగ్ పోలీసు స్టేషన్లలో కేసులు పెట్టి నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. ఇన్ని ఇబ్బందులమధ్య పార్టీలో పనిచేయలేనని పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు నాగేశ్వరరావు తెలిపారు.