– భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు ఇంటి రవి
హుజూర్ నగర్ మార్చి 07 (జనంసాక్షి): కోర్టు స్టేల పేరుతో మెయిన్ రోడ్ పనులను మధ్యలో నిలిపివేయడం బిఆర్ఎస్ ప్రభుత్వానికి సరికాదని
హుజూర్ నగర్ భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు ఇంటి రవి అన్నారు. మంగళవారం పట్టణ అధ్యక్షులు ఇంటి రవి ఆధ్వర్యంలో పట్టణంలోని శాంతి స్తూపం వద్ద ఏర్పడ్డ గుంతల వద్ద వాహనదారులకు గులాబీ పూలు ఇస్తూ వినూత్న నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఇంటి రవి మాట్లాడుతూ గుంతలుగా తయారైన రోడ్డు పై సిసి రోడ్ వేయాలని కోరారు. మెయిన్ రోడ్డుపై గజం లోతు గుంటలతో బస్సులు ఆటోలు ఇబ్బందులకు గురవుతున్నారని డిమాండ్ చేశారు.బైకులు ఆటోలు రైతుల ట్రాక్టర్లు ఇరుక్కుపోతున్నా పట్టించుకోకుండా కాలం వెళ్లబోస్తుందని వెంటనే రోడ్లపై తగు చర్యలు తీసుకోకుంటే బి ఆర్ ఎస్ ప్రభుత్వనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు ఉమామహేశ్వరరావు, గుండా గోపి, కంటు నాగరాజు, గుగులోతు రవి, నకిరేకంటి రాంబాబు, దేవిశెట్టి మురళి, గోపి, కృష్ణ, మట్టయ్య, శ్రీనివాసరావు, అమరు, తదితరులు పాల్గొన్నారు.




