Tuesday, 3 November 2026

లండన్‌ ఒలింపిక్స్‌కి క్రీడాకారుల రాక ఆరంభం

లండన్‌: ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి ప్రపంచం నలుమూలలనుంచి క్రీడాకారులు, విలేకరులు, అధికారులు రావడం ప్రారంభమైంది. విమానాశ్రయంలో అతిథులకు స్వాగతం చెప్పడానికి వారి బరువైన క్రీడాసామగ్రిని చేరవేయడంలో తోడ్పడడానికి అధికారులు వెయ్యి మంది వాలంటీర్లను నియమించారు. భద్రత కోసం స్నిఫర్‌ డాగ్స్‌తో కూడిన పోలీసు బలగాలను నియమించారు. ఎయిర్‌పోర్టునుంచి ఒలింపిక్‌ విలేజ్‌కి బస్సులు నిరంతరాయంగా తిరుగుతూనే ఉండే ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *