లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం లో భాగంగా యజ్ఞం*
మెట్పల్లి పట్టణ కేంద్రంలోని బోయవాడలోని లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం లో భాగంగా ఈరోజు స్థాపిత దేవార్చన, నిత్య హోమం ,క్షీరాదీవాస హోమం జలాదివాసం, కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు,
అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదం అందించారు, ఆలయంలో నిర్వాహకులు మాట్లాడుతూ, శుక్రవారం రోజున లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం మధ్యాహ్నం 11 గంటలకు ఉంటుందని పట్టణ ప్రజలు కళ్యాణానికి వచ్చి లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం వీక్షించి స్వామివారి కరుణ కటాక్షాలు పొందాలని కోరారు,
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు పర్మి నరసయ్య ,కోశాధికారి ఆర్మూర్ నరేందర్ ,తోపారం నాగయ్య ఆర్మూర్ పోచయ్య ,ప్రోహార్ హేమాచందర్, పురుషోత్తం నవీన్ ,గంగాధర్ ,రాజు, పోచయ్య తదితర కమిటీ సభ్యులు భక్తులు సంఘ సభ్యులు పాల్గొన్నారు
లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం లో భాగంగా యజ్ఞం




