మైనార్టీ సెంట్రల్ కమిటీ అధ్యక్షునికి సన్మానం*
మెట్పల్లి టౌన్, డిసెంబర్ 09, జనంసాక్షి:
మైనారిటీ సెంట్రల్ కమిటీ అధ్యక్షులుగా ఎన్నికైన మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ కుతుబుద్దీన్ కు హార్దిక శుభాకాంక్షలు తెలుపుతూ. నేడు మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు నివాసం పార్టీ కార్యాల ఆవరణలో పార్టీ నాయకులు కార్యకర్తలు శాలువాలతో పూలమాలతో ఘనంగా సన్మానించారు. అదేవిధంగా ఈయనతో పాటు మెట్పల్లి పట్టణ సీనియర్ కౌన్సిలర్ షాకీర్ను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు భాసెట్టి హరీష్ మాట్లాడుతూ స్థానిక సమస్యలపై నిరంతర పోరాటం చేసే మహమ్మద్ కుతుబుద్దీన్, షాకీర్లు ప్రజాసేవలో మరింత ముందుకు వెళ్లాలని, మరెన్నో పదవులు ఆశించాలని కోరారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మైనార్టీ సెంట్రల్ కమిటీ అధ్యక్షునికి సన్మానం




