Friday, 6 November 2026

లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం

లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం
హుజూర్ నగర్ నవంబర్ 22 (జనంసాక్షి): లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం మండలంలోని అమరవరం గ్రామంలో సర్పంచ్ గుజ్జుల సుజాత అంజిరెడ్డి లతో కలిసి హుజూర్ నగర్ జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి లు మంగళవారం లబ్ధిదారులకు లక్షా 12 వేల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ నిధుల ద్వారా కోట్ల రూపాయలను పేదలకు మంజూరు చేయిస్తున్నారు అన్నారు. వివిధ ప్రమాదాలకు దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారికి చికిత్సకోసం ఎల్ ఓ సి ల రూపంలో లక్షల రూపాయలు మంజూరు చేయించి పేదల వైద్యానికి బాసటగా నిలబడుతున్నారన్నారు. నియోజకవర్గ కేంద్రం లో ఉన్నటువంటి ప్రాంతీయ వైద్యశాలలో, లింగగిరి ప్రాథమిక వైద్యశాలలో మౌళిక వసతుల కల్పనకు మెరుగైన వైద్య సౌకర్యం కోసం పూర్తి స్థాయి సిబ్బంది నియామకానికి విశేష కృషి చేశారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడం కోసం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సహాయం అందిస్తున్నారన్నారు. ప్రజల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా 12 వైద్య కళాశాలను వాటికి అనుబంధంగా ఆసుపత్రులను నెలకొల్పడంతో పాటు ఔషధాల కొరత లేకుండా చూడడం ద్వారా పేదలకు మరింత వైద్యసేవలు అందించడానికి కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో కంటి వెలుగు కార్యక్రమంతో అనేకమంది వృద్ధులకు కంటిచూపు ప్రసాదించారని తెలియజేశారు. కెసిఆర్ కిట్టు, అమ్మ ఒడి వంటి వినూత్న సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలు పెరిగేలా చర్యలు చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాల సైదులు, మాజీ సింగిల్విండో చైర్మన్ కామిశెట్టి వెంకటేశ్వర్లు, వార్డు సభ్యులు మిరియాల రాధా శ్రీనివాస్, సిద్ధం కవిత, నాగరాజు, తేళ్ల సుగుణ, నగేష్, టిఆర్ఎస్ నాయకులు కట్ట రామిరెడ్డి, హనుమంత్ రెడ్డి, సురేష్, లబ్ధిదారులు గాలం సైదమ్మ, గుంజ భవాని, కందుల నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.