వైద్యంకోసం హనుమాన్ యూత్ సభ్యులు ఆర్థిక సహాయం
ఇటిక్యాల (జనంసాక్షి) నవంబర్ 22 రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఎమ్ న్ జీ (నీలోఫర్) ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న మండల పరిధిలోని ఎర్రవల్లి వాసి రామేశ్వరమ్మ కు వైద్యం కోసం హనుమాన్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో 51000/- వేలు ఆర్థిక సాయం అందించినట్లు హనుమాన్ యూత్ సభ్యులు కృష్ణసాగర్, జమ్మన్న తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాలో ఒక్కడైనా మా మిత్రుడు రాజేష్ తల్లి రామేశ్వరమ్మ గత కొంతకాలం నుండి అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదు నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆమెను మంగళవారం హనుమాన్ యూత్ సభ్యులు హైదరాబాద్ వెళ్లి ఆస్పత్రిలో రామేశ్వరమ్మ ను పరామర్శించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం మా వంతు సహాయంగా రూ. 51 వేలు ఆర్థిక సహాయం అందజేసి రాజేష్ కి మనోధైర్యం కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ యూత్ సభ్యులు రవి, పరశురామ్, గోవర్ధన్ తదితరులు ఉన్నారు.




