Wednesday, 4 November 2026

లయన్స్ క్లబ్ అధ్యక్షుడు గా

 

 

 

 

తోటశ్రీనివాస్…మారుతినగర్ లయన్స్ క్లబ్ అధ్యక్షడుగా తోట శ్రీనివాస్ ఎన్నిక
మంచిర్యాల జిల్లాలో నూతనంగా ఏర్పడ్డ మరుతినగర్ లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని సోమవారం రోజు యం ఎన్ ఆర్ గార్డెన్లో జరిగిన సమావేశంలో ఎన్నుకున్నారు.
మంచిర్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దొంతుల ముకేష్ అధ్వర్యంలో నిర్వహించారు.
ముందుగా నూతన సభ్యులకు లయన్స్ క్లబ్ యొక్క విధివిధానాలను వివరించగా అనంతరం నూతనం ఎన్నుకున్న సభ్యులలో ప్రమాణస్వీకారం చేయించారు.
1907 వ సంవత్సములో ఏర్పడ్డ లయన్స్ క్లబ్ దేశ భక్తి,పేద ప్రజలకు సేవ చేసేందుకు ముందు వరుసలో ఉంటుందని కరోనా లాంటి కష్టకాలంలో , మంచిర్యాలలో గోదావరినది వరదలు వచ్చినప్పుడు లయన్స్ క్లబ్ సభ్యులు ముందుడి సేవ చేశారని తెలిపారు.మంచిర్యాల జిల్లాలో ఇప్పటికే చాలా సేవ కార్యక్రమాలు చేస్తున్నామని,నూతనంగా ఏర్పడ్డ లయన్స్ క్లబ్ మరిన్ని సేవలు చేయాలని తెలిపారు.
మారుతి నగర్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు గా తోట శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి ఎర్రం తిరుపతి, కోశాధికారి గా వంశీ కృష్ణ,కార్యదర్శులుగా కర్రే లచ్చన్న, ఎస్ డి అన్వర్, సభులుగా విజేందర్,రామగిరి శ్రీపతి,కనక స్వామి,తోట శ్రీనివాస్,పవన్,శ్రీవాణి, తో పాటు 25మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.
ఈ కార్య్రమానికి పేస్ట్. డిస్ట్రీక్ గవర్నర్ చిదుర సురేష్,వైస్ డిస్ట్రీక్ గవర్నర్ హనుమండ్ల రాజిరెడ్డి,గవర్నర్ క్యాబినెట్ సెక్రటరీ నారాయణ రావు,రీజనల్ చైర్ పర్సన్ చంద్రమోహన్, పోగ్రాం చై ర్మన్ సూర్యనారాయణ. ఆకుల స్వామి, వివేక్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు తోట శ్రీనివాస్ మాట్లాడుతూ చిన్న వయసునుంచే పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాని లయన్స్ క్లబ్ ద్వారా సేవ చేసే అవకాశం కలించిన పెద్దలందరికి ధన్యవాదాలు నా పై ఉంచిన నమ్మకని వమ్ము చేయకుండా సభులందని కలుపుకొని మరిన్ని సేవ చేస్తానని తెలిపారు. అనంతరం మంచిర్యాల ప్రెస్ క్లబ్ వారికి కుర్చీలు,మహిళకు కుట్టు మిషన్ లు, వీల్ ఛైర్స్,అనారోగ్యంతో బడపతున్న వ్యక్తికి 5వెలారుపాయలు అందచేశారు.
నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు తోట శ్రీనివాస్ ను మంచిర్యాల జెడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి,మాజీ ప్రభుత్వ విఫ్ నల్లాల ఓదెలు పట్టణ ప్రముఖులు,వ్యాపారులు శాలువాలతో సన్మానించారు……….జనం సాక్షి