Wednesday, 4 November 2026

అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు

 

 

 

 

 

 

బిచ్కుంద మార్చి 06 (జనంసాక్షి)ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఎస్ఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం పుల్కల్ గ్రామానికి చెందిన ట్రాక్టర్ యజమాని అయిన సాయిలు మరియు హన్మండ్లు ఎలాంటి అనుమతులు లేకుండా వాగు నుండి 2 ట్రాక్టర్లర్లో అక్రమ ఇసుక తరలిస్తుడంతో పోలీసు సిబ్బంది ఆదివారం రాత్రి పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ట్రాక్టర్ యజమాని పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఎవరైనా అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.