సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట నూతన కమిటీని జిల్లా కేంద్రంలోని లయన్స్ సర్వీస్ సెంటర్ లో ఎన్నికల ద్వారా ఎన్నుకున్నారు. 2023 -24 సంవత్సరానికి గాను జరిగిన ఎన్నికల్లో అధ్యక్షులుగా దేవిరెడ్డి రవీందర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా బోనగిరి విజయకుమార్, పెద్దిరెడ్డి కళ్యాణ్, ప్రధాన కార్యదర్శిగా రంగు దిలీప్ కుమార్, కోశాధికారిగా బేజాగం ఫణి కుమార్, సహాయ కార్యదర్శిగా మీలా వంశీ, ప్రోగ్రాం కోఆర్డినేటర్ గా పాశం అనంతరాములు, ప్రోగ్రాం కోఆర్డినేటర్ చైర్మన్ గా వాంకుడోత్ వెంకన్ననాయక్ లను ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారులుగా పెండెం చంద్రశేఖర్, చిలుముల శ్రీనివాస్ రెడ్డి, యామా రమేష్ లు వ్యవహరించారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ సమిష్టి కృషితో లయన్స్ క్లబ్ ద్వారా సేవలందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా బిఆర్ఎస్ నాయకులు గండూరి కృపాకర్, నూకల వెంకట రెడ్డి, డాక్టర్ రమేష్ చంద్ర , బావ్ సింగ్, వెంపటి శబరినాథ్, బజ్జురీ శ్రీనివాస్ ,మిట్టపల్లి రమేష్ ,డోగుపర్తి ప్రవీణ్,రాచకొండ శ్రీనివాస్ ,ముద్ద భిక్షపతి, బొమ్మగాని సైదులు,పుట్టా వెంకన్న, మంచాల శ్రీనివాస్ ,గజ్జి నాగేందర్,మద్ది సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.




