Thursday, 5 November 2026

వేసవి సెలవుల్లో విద్యార్థులు సమయం వృద్ద చేసుకోవద్దు.v”డిఎస్ఆర్ సేవ దళం” అధ్వర్యంలో విద్యార్థులకు పెన్నులు, నోట్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన

 

 

 

 

 

 

 

గద్వాల ప్రతినిధి ఏప్రిల్ 24 (జనంసాక్షి):-  జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల హరిజచెర్రి నందు 5వ తరగతి ముగిసిన విద్యార్థులకు  డిఎస్ఆర్ సేవ దళం సభ్యుడు ధరూర్ రవి అధ్వర్యంలో  పెన్నులు, నోట్ పుస్తకాలు ధరూర్ గ్రామ సర్పంచ్ పద్మమ్మ,హెచ్ఎం రేవతి చేతులమీదుగా పంపిణీ చేశారు..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి సెలవుల్లో విద్యార్థులు ఇంటి దగ్గర ఉండి ముందు తరగతులకు సంబంధించిన పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని,పంట పొలాల పనులకు,బావుల వద్దకు ఇంతకు గాని ఎండాలకు తిరగకుండా జాగ్రత్త వహించాలని విద్యార్థులకు సూచించారు.. విద్యార్థులు మంచి నడవడికతో పాటు చెడు ప్రభావాలు అలవాట్లకు గురికాకుండా ఉండాలన్నారు..ఈ కార్యక్రమంలో డిఎస్ఆర్ సేవ దళం సభ్యుడు ధరూర్ రవి,సర్పంచ్ పద్మమ్మ, హెచ్ఎం రేవతి, ఉపాధ్యాయ బృందం కిషోర్ చంద్ర,నీలవతి,డేవిడ్ విద్యార్థులు తదితరులు ఉన్నారు…