Tuesday, 3 November 2026

లాభాల్లో ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు

ముంబయి,(జనంసాక్షి): ప్రపంచ మార్కెట్‌ మంగళవారం చాలా వరకు లాభాల్లో ఉన్నాయి. అమెరికా మార్కెట్లలో డౌజోణ్స్‌ 0.44 శాతం పెరిగి 14,974 వద్ద ముగిసింది. నాస్‌డాఖ్‌ 0.91 శాతం పెరిగి 3,434 వద్ద క్లోజయింది. ఎస్ప్‌ఈ 500 సూచీ 0.54 శాతం లాభపడి 1,615 వద్ద ముగిసింది. యూరప్‌ మార్కెట్లలో బ్రిటన్‌ సూచీ ఒకటిన్నర శాతం లాభపడింది. ఫ్రాన్స్‌ సూచీ 0.76 శాతం, జర్మనీ సూచీ 0.31 శాతం లాభపడ్డాయి.
ఈ ఉదయం ఆసియా మార్కెట్లలో జపాన్‌, సింగపూర్‌ సూచీలు ఒక శాతం దాకా లాభపడుతున్నాయి. హాంకాంగ్‌, షాంఘై సూచీలు స్వల్పంగా నష్టాల్లో ఉన్నాయి. సింగపూర్‌ నిఫ్టీ 25 పాయింట్ల దాకా కోల్పోతూ 5,865కు సమీపంలో ట్రేడవుతుంది. మరోవైపు జౌన్స్‌ గోల్డ్‌ ధర 3 డాలర్ల దాకా లాభపడుతూ 1255 డాలర్లకు సమీపంలో ట్రేడవుతుంది. గతరాత్రి ఎంసీక్స్‌లో 10గ్రాముల ధర 285 రూపాయలు లాభపడి 25,954 వద్ద ముగిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *