Tuesday, 3 November 2026

కళాశాల బస్సు బోల్తా…. విద్యార్థులకు గాయాలు

కామవరపుకోట (పశ్చిమగోదావరి): జూనియర్‌ కాలేజీ బస్సు మంగళవారం ఉదయం బోల్తా పడి దాదాపు 20మంది విద్యార్థులు గాయపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలం తాడిచర్ల సమీపంలో ద్వారకాతిరుమల గ్రామానికి చెందిన ఎలైట్‌ పబ్లిక్‌ స్కూల్‌, జూనియర్‌ కాలేజి బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో బస్సులోని విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఏలూరు ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *