Tuesday, 3 November 2026

లారీని ఢీ: ఇద్దరి మృతి

అల్వాల్‌, హైదరాబాద్‌ : బొల్లారంలోని రాజీవ్‌ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. గోదావరిఖని నుంచి వస్తున్న ఇన్నోవా వాహనం బొల్లారం ఎయిర్‌ఫోర్ట్‌ ప్రధాన ద్వారం ఎదురుగు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఖలీలుద్దీన్‌ (25), ప్రవీణ్‌కుమార్‌ (25)లు అక్కడిక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *