లారీ ఓనర్లను కాపాడుకుంటాం
ఓనర్లు డ్రైవర్లు క్లీనర్ల జీవితాల్లో వెలుగులు
* లారీల పార్కింగ్ కోసం 3 ఎకరాల స్థలం
– పట్టణ లారీ ఓనర్స్ అసోసియేషన్ నూతన పాలకవర్గం
* మంత్రి గంగుల, వినోద్ కుమార్
కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) :
లారీ ఓనర్లు, డ్రైవర్లు, క్లీనర్ల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తానని బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్ హామీ ఇచ్చారు. లారీ ఓనర్ల అసోసియేషన్ కు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
గతంలో లారీలకు గిరాకీ లేక అప్పుల పాలై లారీలు అమ్ముకునే పరిస్థితులు ఉండేవని కాళేశ్వరం ప్రాజెక్టు రాకతో భూమికి బరువయ్యే పంట పండి లారీలకు రెట్టింపు డిమాండ్ వచ్చిందన్నారు.
కరీంనగర్ లారీ ఓనర్స్ అసోసియేషన్ కు సంబంధించిన లారీలకు పార్కింగ్ స్థలం లేక అనేక సమస్యలు తలెత్తుతున్నాయని వాటి కోసం ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాన్ని కెటాయించామన్నారు.
లారీ ఓనర్ల అసోసియేషన్ కు ప్రభుత్వ పరంగా అండగా ఉంటానని హామి ఇచ్చారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. లారీల పార్కింగ్ కోసం స్థలం లేక రోడ్ల పై పార్కింగ్ చేయడంతో ప్రమాదాలు జరిగి ఇబ్బందులు తలెత్తుతున్నాయని లారీ ఓనర్ల విజ్ఞప్తి మేరకు 3 ఎకరాల పార్కింగ్ స్థలాన్ని కెటాయించామన్నారు.
లారీ అసోసియేషన్ కు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటానన్న మంత్రి గంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. తెలంగాణ రాకముందు గిరాకీ లేక అప్పుల పాలై లారీలు అమ్ముకున్న పరిస్థితులుండేవని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత భూమికి బరువయ్యే పంట పండి దీంతో లారీలకు రెట్టింపు డిమాండ్ వచ్చి గిరాకీ పెరిగిందన్నారు. సమైక్య పాలనలో పడ్డ కష్టాలు తెలంగాణ వచ్చిన తర్వాత దూరమయ్యాయన్నారు. లారీ ఓనర్ల సమస్యలు పరిష్కారిస్తే ఇది పరోక్షంగా ఈ వ్యవస్థ పై ఆధారపడ్డ ఎన్నో కుటుంబాలకు ఉపాధి కల్పిస్తుందన్నారు. పెరిగిన టాక్స్ ల పై మంత్రి అజయ్ కుమార్ వద్దకు వెళ్ళి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామి ఇచ్చారు.
ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. ఇప్పటికే లాయర్ల సమస్య పరిష్కారం కోసం కృషి చేశామని ఇప్పుడు లారీ ఓనర్లు పడుతున్న ఇబ్బందుల తో పాటు టాక్స్ లు ఇతరాత్ర సమస్యల పై సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తామని హామి ఇచ్చారు.ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడు ఉంటుందన్నరు. నగరంలోకి లారీల అనుమతి పై ఆలోచన చేస్తామన్నారు. లారీ ఓనర్లు, డ్రైవర్లు, క్లీనర్ల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తామన్నారు. లారీ ఓనర్లు, డ్రైవర్లు, క్లీనర్లకు అందుబాటులో ఉండి పనిచేస్తామన్నారు..అధ్యక్షులుగా పెద్ది రమేష్ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా ప్రధాన కార్యదర్శిగా షేక్ రహీమొద్దీన్, ఉపాధ్యక్షులుగా ఖాజా మొహినొద్దీన్, మనోహర్ యాదవ్, సింగిడి రామక్రిష్ణారెడ్డి ఎన్నికయ్యారు. కోశాదికారిగా సయ్యద్ మిన్హాజుద్దీన్… సహాయ కార్యదర్శిగా కమటం కనుకరాజు… షేక్ సాజిద్ పాష… అలీలు ఎన్నికయ్యారు.