రేగోడ్ //జనం సాక్షి //ఏప్రిల్ :
లారీ బైక్ ఢీకొనగా సంఘటన రేగోడ్ మండల పరిధి లోని టి లింగంపల్లి గ్రామంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది, గ్రామస్తుల పోలీసుల కథనం ప్రకారం, గజవాడ విద్యుత్ సబి స్టేషన్ లో విధులు నిర్వహించుకుని తన స్వగ్రామమైన పెద్ద శంకరంపేట మండలంలోని మల్కాపూర్ గ్రామానికి వెళుతున్న క్రమంలో లారీ బైక్ ఒకే వైపు వెళుతుండగా లారీని తప్పించబోయి లారీ టైర్ కింద పడి బూత్కూరి నాగరాజు( 34 ) మృతి చెందినట్లు ఏఎస్సై మల్లయ్య తెలిపారు. తీవ్ర గాయాలైన బూత్కూరి నాగరాజును వెంటనే 108 అంబులెన్స్ లో నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మారగ్గా మద్యంలో మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి తండ్రి జనార్దన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుకున్నట్లు తెలిపారు.
లారీ బైక్ ఢీ వ్యక్తి మృతి




