విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా పరదేశి పాలెం సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇటుక లోడ్తో అధిక వేగంతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మరణించగా…. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి… క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని… మృతదేహలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహలను విశాఖలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




