Tuesday, 3 November 2026

లింగమంతుల జాతరలో భారీగా ఏర్పాట్లు 

 సందర్శించిన మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి
సూర్యాపేట,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి):  లింగమంతుల జాతరకు వందేళ్ల చరిత్ర ఉందని మంత్రి జగదీశ్‌ రెడ్డి పొగిడారు. సోమవారం ఉదయం పెద్దగట్టు లింగమంతుల స్వామిని దర్శించుకున్నారు. లింగమంతుల జాతరకు వచ్చే భక్తులకు ఈసందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. పరిశుభ్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధవహిస్తున్నామని, కెసిఆర్‌ పాలనలో పెద్దగట్టుకు మెట్ల నిర్మాణం, శాశ్వత మరుగుదొడ్లు నిర్మించామని పేర్కొన్నారు. ప్రతి భక్తునికి మిషన్‌ భగీరథ నీళ్లు అందించామని జగదీష్‌ వెల్లడించారు. గత ప్రభుత్వాలు లింగమంతుల జాతరను పట్టించుకోలేదని మండిపడ్డారు. పెద్దగట్టుకు భారీగా నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామని హావిూ ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు, భక్తులకు లింగమంతుల స్వావిూ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానన్నారు. తుంగతుర్తి ఎంఎల్‌ఎ గాదరి కిషోర్‌ కుమార్‌, దేవస్థాన కమిటీ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.