మియాపూర్, హైదరాబాద్ : ఎస్సై సుధీర్ వేధింపులపై లీల అనే మహిళ కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ఎస్సై సస్పెండ్ అయ్యారు. ఈలోపు ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు పాల్పడిన కారణంగా ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. అమెను మియాపూర్ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాగా, న్యాయమూర్తి సెలవులో ఉన్న కారణంగా రాజేంద్రనగర్ కోర్టుకు తరలించారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు లీల వాంగ్మూలం నమోదుకు కోర్టులో హాజరుపరచాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు.




