హైదరాబాద్:తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళనకు దిగారు. సీఐటియు ఆధ్వర్యంలో లేబర్ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్నారు.కనీస వేతనం రూ.15 వేలు చెల్లించాలని, ఈఎస్‌ఐ, పీఎఫ్, బోనస్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నేత చుక్కారాములు, రాజారావు, సాయిబాబు పాల్గొన్నారు




