Wednesday, 4 November 2026

లైంగిక దాడులపై దైర్యంగా పిర్యాదు చేయండి. -జిల్లా ఎస్పీ కె. సృజన.

గద్వాల నడ్డిగడ్డ, మే 20 (జనం సాక్షి) వేదింపులు, హత్యాచారం, నిరాదరణకు గురైన బాధిత మహిళలకు, బాలలకు ఒకే చోట మెడికల్, న్యాయసలహా, వైద్యం, కౌన్సిలింగ్, సైకాలజికల్ సపోర్టు ఇలా అన్ని సౌకర్యాలు ఒకే చోట కల్పిస్తూ రాష్ట్ర పోలీసు మహిళ అండ్ చెల్డ్ వెల్ఫేర్ అధ్వర్యంలో బరోసా కేంద్రము సేవలు అందించడం జరుగుతుందని బాదితులు దైర్యం గా ముందుకు వచ్చి పిర్యాదు చేయాలనీ జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ కె. సృజన అన్నారు.జిల్లా కేంద్రములో ఏర్పాటు చేసిన బరోసా సెంటర్ యొక్క విధి విధానాలు, లక్ష్యాలు, ఉద్దేశ్యం అంశాలపై జిల్లా ఎస్పీ శనివారము జిల్లా పోలీసు కార్యాలయం నందు బరోసా సెంటర్, అనుబంధ లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో, ఎన్జీవో లతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళలకు రక్షణగా పిల్లల పై జరిగే లైంగిక దాడుల నివారణ, నిరాదారణకు, దాడులకు గురైన మహిళలకు, బాలలకు అండగా ఉండడమే లక్ష్యంగా జిల్లాలో బరోసా సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని.
లైంగిక దాడులకు గురైన మహిళలు, బాలికలు, బాలలు దైర్యంగా ముందుకు వచ్చి పిర్యాదు చేసేటట్లు ప్రజలకు సంబంధిత శాఖల వారు అవగాహాన కల్పించి తగు చర్యలు చేపట్టాలని సూచించారు.ఎలోప్మెంట్, అత్యాచారం, బాలలపై లైంగిక వేదింపులు, దాడులు లాంటి కేసులు నమోదు అయినప్పుడు బాధితులను బరోసా సెంటర్ కు పంపించి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరుగుతోందనీ, ప్రతి కేసుకు, పిర్యాదుకు బరోసా ఆన్లైన్ నంబర్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అక్కడ మెడికల్, న్యాయసలహా, వైద్యం, కౌన్సిలింగ్, సైకాలజికల్ సపోర్టు ఇలా అన్ని సౌకర్యాలు ఒకే చోట బాధితులకు కల్పించడంతో పాటు కేసు ముగిసే వరకు సపోర్ట్ పర్సన్, లీగల్ అడ్వైసర్ అందుబాటులో ఉంటూ బాధితులకు బరోసా సెంటర్ అండగా ఉండటం జరుగుతోందనీ ఎస్పీ అన్నారు.బాధితులకు నేషనల్ మినరల్ ఫండ్ ద్వారా చదువు, వైద్యం ఇతర అవసరాలను సైతం తీర్చడం జరుగుతోందనీ. స్థానిక హాస్పటల్ సహాయంతో ఇన్ పేషెంట్ విభాగం ను ఏర్పాటు చేసి సేవలు అందించడం జరుగుతుందని అన్నారు.బరోసా లైన్ డిపార్ట్మెంట్స్, ఎన్జీవో లు సమన్వయంతో పని చేస్తూ బాధితులకు సెల్టర్ సైతం ఇవ్వడం జరుగుతోందనీ అన్నారు.బరోసా సెంటర్, అనుబంధ శాఖల అధికారులు సమన్వయంగా పని చేయాలని మానవ అక్రమ రవాణా, పిల్లల పై లైంగిక దాడులను నివారించాలని అన్నారు. బరోసా సెంటర్ యొక్క పని తీరు, విధి విధానాలపై అధికారులకు అవగాహన కల్పించడం తో పాటు ఇతర శాఖల వారు బరోసా సెంటర్ కు అదించాల్సిన సపోర్ట్ ను తెలియజేశారు. బాలికల పై భౌతిక దాడులను, హత్యాచారం దాడులను అడ్డుకోవడం లో పకడ్బందీ చర్యలు చేపట్టాలని చిన్నారులను కాపాడుకోవడం మన అందరి బాధ్యత అని అన్నారు.వేదింపులకు సంభందించి బాదితులు దైర్యంగ పిర్యాదు చేయాలనీ కోరారు. బరోసా సెంటర్ కు జిల్లా స్థాయిలో అన్ని విభాగాల వారు అనుబంధంగా ఉంటూ సపోర్ట్ అందించాలని అన్నారు. ఎలొప్ మెంట్ కేసులు జరుగకుండా ముందుగానే ప్రజలకు పిల్లల తల్లిదండ్రులకు అన్ని శాఖల వారు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. భరోసా సెంటర్ నిర్వహణలో పోలీస్, లైన్ డిపార్ట్మెంట్స్ శాఖల రోల్ ను తెలియజేశారు.భరోసా సెంటర్ కు సంబంధించి పొక్సో యాక్ట్ చట్టం లో కేసు నమోదు అయినప్పుడు బరోసా సెంటర్ లో బాధితుల స్టేట్మెంట్ రికార్డ్ చేయడంతో పాటు ఎస్ ఓ పి ను అనుసరించి పోలీస్ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో టెక్నికల్, ఇతర ఏవిడెన్స్ లను కలెక్ట్ చేసి పకడ్బందీ గా చార్జిషీట్ వేయడం ద్వారా నిందితులకు శిక్షా పడేందుకు అవకాశము ఉంటుందనీ అన్నారు.
జిల్లా లో మహిళలలు, బాలికలు, బాలల పై లైంగిక దాడులు అరికట్టేందుకు మనమందరం అన్ని శాఖలతో సమన్వయం చేసుకొంటూ బాధ్యతగా పని చేయాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి ముసాయిదా బేగం, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ సిద్దప్ప, పొక్సొ కోర్ట్ అడిషనల్ పీపీ ఆనంద్, మెడికల్ సూపరింటెండెంట్ కిషోర్, టి డబ్ల్యూ సి చైర్ పర్సన్ సహదేవ్, చైల్డ్ లైన్ కో ఆర్డనేటర్ శివలిల, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి భాస్కర్, లీగల్ చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి- శివయ్య, బరోసా ఇంచార్జి ఎస్సై రమా దేవి, బరోసా కో ఆర్డినేటర్ శివాని, సి డబ్ల్యూ సి మెంబర్స్ జయబారతి, శైలజ, ఎన్జీవోస్ దేవేందర్, పరుషరాముడు, అబ్రహం, చైల్డ్ బరోసా సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు.