Wednesday, 4 November 2026

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో విప్లవాత్మకమైన విద్యుత్ మార్పులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

వికారాబాద్ రూరల్ మే 20 జనం సాక్షి
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో విప్లమాత్మకమైన విద్యుత్ మార్పులు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో విద్యుత్ కొలత లేని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిందని రాష్ట్ర విద్యాశాఖ మాత్యులు సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యే *డాక్టర్ మెతుకు ఆనంద్ మరియు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య వికారాబాద్ జిల్లా కేంద్రంలో 3.69 కోట్ల నిధులతో విద్యుత్ సూపరింటెండింగ్ ఇంజనీర్ వారి నూతన కార్యాలయంకు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో బిసి కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ , జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ విద్యుత్ శాఖ ఎస్సీ జయరాజ్ డి ఈ భాను ప్రకాష్ సంజీవ్ శివప్రసాద్ నిర్దోపరెడ్డి బ్రహ్మ సాగర్ ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.