Wednesday, 4 November 2026

లోకకళ్యాణార్థం భక్తుల పాదయాత్రికులకు తేనేటి విందు-బలరాం జాదవ్

నేరడిగొండమార్చి24(జనంసాక్షి): మండలంలోని ధార్మిక్‌ నగర్ నందు శ్రీరామనవమి పురస్కరించుకొని ప్రతియేట బోథ్ నియోజకవర్గం వివిధ మండలాలకు చెందిన శబరి మాత భక్తులు నిర్వహించే పాదయాత్రలో మార్గ మధ్యంలోని బలరాం జాదవ్ ఇంట్లో సేదతీరారు.లోక కళ్యాణార్థం భక్తులు కాలినడకన కామారెడ్డి జిల్లాలోని తాడ్వాయి గ్రామంలో వెలసిన శబరిమాత ఆలయాన్ని దర్శించుకొని అమ్మవారి ఆశిస్సులు పొందుతారు.ఎప్పటి లాగానే శుక్రవారం రోజున ఈసారి కూడా వీరికి తెలంగాణరాష్ట్ర అధ్యాపకసంఘం ప్రధానకార్యదర్శి బలరాం జాదవ్ తన సొంత గ్రామంలో (ధార్మిక్ నగర్)పండ్లు,మజ్జిగ, తేనేటివిందు ఏర్పాటు చేసారు.దాదాపు 400 మంది భక్తులు బలరాం ఇంట్లో సేదదీరిన తరువాత వారితో పాటు తానుకూడా కొద్ది దూరం అడుగులో అడుగు వేసారు.శబరిమాత చిన్ననాటినుండే రాముని మీద మక్కువతో పాటలు పాడేదని,రాముని మార్గంలోనే నడవాలని భక్తులకు హితబోధ చేసేదని అందుకే శబరమ్మ రామ భక్తురాలిగా పేరుగాంచిందని మాట్లాడుకుంటు వారికి వీడ్కోలు పలికారు.బలరాంకు తమపై ఉన్న అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు.