Tuesday, 3 November 2026

లోక్‌ అదాలత్‌ సద్వినియోగం చేసుకోవాలి

ఆదిలాబాద్‌,మార్చి3(జ‌నంసాక్షి): లోక్‌ అదాలత్‌లో సమస్యలు పరిష్కరించుకోవాలని ఇన్ఛార్జి జిల్లా న్యాయమూర్తి కుంచాల సునీత ఒక ప్రకటనలో తెలిపారు. కక్షిదారులు 14న జిల్లావ్యాప్తంగా జరిగే  అదాలత్‌ను సద్వినియోగం చేసుకుని కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు.  జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 14న జిల్లాన్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్‌  అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అదాలత్‌ నిర్వహణపై రెవెన్యూ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ అదాలత్‌లో రెవెన్యూకు సంబంధించిన అన్ని కేసులు, ఉపాధిహావిూ పథకానికి సంబంధించి, భూ నష్టపరిహారకేసులను  పరిష్కరించనున్నట్లు చెప్పారు. ఇదిలావుంటే  ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడంలో చురకుగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ తరుణ్‌జోషి అన్నారు. నూతన పోలీసు వ్యవస్థలో ప్రజా ఫిర్యాదులకు పెద్దపీట వేశారని తెలిపారు. రోజువారి పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి స్టేషన్‌లో మౌలిక సదుపాయాలు కల్పించామని.. ఫిర్యాదు అందిన వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి దర్యాప్తు ప్రారంభించాలని ఆదేశించారు. అలాగే పదవీ విరమణ చేసిన పోలీసులు ప్రజల మధ్య ఉండి నేరాలను అదుపు చేసేందుకు కృషిచేయాలని తరుణ్‌జోషి అన్నారు. జిల్లాలో పోలీసు ఉద్యోగం చేసి పదవి విరమణ పొందినందుకు గర్వంగా భావించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *