హైదరాబాద్ : మణికొండ ప్రభుత్వం భూమిని డంపింగ్ యార్డ్‌గా ఉపయోగిస్తున్న ల్యాంకోహిల్స్ యాజమాన్యంపై రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. రాజేంద్రనగర్ తహసీల్దార్ ఫిర్యాదు మేరకు 427,447 సెక్షన్ల కేసు నమోదు చేశారు. 15 రోజుల క్రితం నోటీసులు ఇచ్చినప్పటికి ల్యాంకోహిల్స్ యాజమాన్యం స్పందించకపోవడంతో చర్యలు చేపట్టనున్నట్లు తహసీల్దార్ తెలిపారు.




