ఉస్మానియా వర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు ముస్తాబైంది. బుధవారం నుంచి జరగబోయే వేడుకలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించనున్నారు. మూడు రోజుల పాటు.. ఘనంగా జరగనున్న ఈ శతాబ్ది ఉత్సవాలకు . గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ పండుగలో ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేపట్టారు పోలీసులు. ముఖ్యంగా రాష్ట్రపతి నగరానికి వస్తుండటంతో గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు పోలీసులు.
రాష్ట్రపతి వచ్చే దారి వెంట మందితో భద్రత ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి మొదట ఢిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. తర్వాత అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఓయూ కు చేరుకుంటారు. ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి రాజ్ భవన్ కు వెళ్తారు. సాయంత్రం గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. దీంతో రాష్ట్రపతి వెల్లే దారిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.
ఓయూ ఉత్సవాలకు విద్యార్ధులు భారీ సంఖ్యలో హాజరు కావాలన్నారు సీపీ మహేందర్ రెడ్డి. సోమవారం ఓయూ విద్యార్ధి సంఘంతో మాట్లాడారు. శతాబ్ది ఉత్సవాలు సక్సెస్ గా జరిగేందుకు అందరూ సహకరించాలన్నారు. ఏమైన సమస్యలుంటే ప్రభుత్వంతో మాట్లాడుతామని చెప్పారు. మూ డు రోజుల పాటు జరగనున్న ఉత్సవాలకు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తో పాటు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు హాజరు కానున్నారు.




