విశాఖపట్నం జనంసాక్షి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వక్ఫ్‌భూముల ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మైనారిటీ సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి ఇక్బాల్ హెచ్చరించారు. విశాఖపట్నంలో మూడు జిల్లాల ఆర్డీవోలు, వక్ఫ్‌బోర్డు అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వక్ఫ్ భూములను అమ్మడానికి వీలు లేదని, ప్రభుత్వం సైతం లీజుకు మాత్రమే ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. వక్ఫ్ భూములను ఆదాయ మార్గాలుగా మారుస్తామన్నారు.




