Wednesday, 4 November 2026

వచ్చే ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలికేసిఆర్‌ పిలుపు

కరీంనగర్‌, నవంబర్‌ 7 : 2014లో జరగనున్న ఎన్నికలకు టిఆర్‌ఎస్‌ నేతలు సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ అధినేత చంద్రశేఖర్‌రావు అన్నారు. రెండవ రోజు గురువారం జరిగిన మేధోమధనం సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలోని అన్ని జిల్లాల్లో తాను బస్సు యాత్ర ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కెటిఆర్‌ పాదయాత్రలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమతికి తెలంగాన ప్రాంతంలో ప్రజల మద్దతు ఉందని ఆ పార్టీకే పట్టం కడతారని తాము విశ్వసిస్తున్నానని అన్నారు.  10ఎంపీ స్థానాలు, 100ఎమ్మెల్యే స్థానాలకు టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోవాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఢిల్లీలో తను ఉన్న రోజుల్లో ఎవ్వరితో తెలంగాణ విషయం ప్రసంగించలేదని, వచ్చిన విమర్శలను ఆయన ఖండించారు. ఢిల్లీలోని ముఖ్య నాయకులతో తెలంగాణ విషయంపై చర్చలు జరిపానని అన్నారు. తెలంగాణ ప్రాంతంలో 2014 ఎన్నికలలో టిఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమని అన్నారు. తాను 40రోజుల పాటు తెలంగాణ ప్రాంతంలో పర్యటించి ప్రజలకు తెలంగాణ ఏర్పాటు పై అవగాహన కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ విజయశాంతి, ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్‌, హరీష్‌రావు, కె. ఈశ్వర్‌, ఎస్‌.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *