Monday, 2 November 2026

వచ్చే ఏడాది నుంచి రైతులకు 9గంటల విద్యుత్‌ : హరీష్‌రావు

మెదక్‌, ఏప్రిల్‌ 02 : వచ్చే ఏడాది నుంచి రైతులకు 9గంటల విద్యుత్‌ ఇస్తామని మంత్రి టి.హరీష్‌రావు అన్నారు. జిల్లాలోని చిన్నకోడూరులో మిషన్‌ కాకతీయ పనులను ప్రారంభించిన మంత్రి అనంతరం మాట్లాడుతూ ఆంధ్ర పాలకుల వల్లే తెలంగాణలో చెరువులు నాశనమయ్యాయని ఆరోపించారు. మిషన్‌ కాకతీయలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వివిధ సంఘాల ఆధ్వర్యంలో రూ.2.60లక్షల విరాళాన్ని మంత్రి హరీష్‌రావుకు అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *