వజ్రోత్సవాల్లో ప్రతీ ఒక్కరు భాగస్వామ్యం కావాలి

చిగురుమామిడి పోలీస్ స్టేషన్లో మొక్కలు నాటిన మండల అధికారులు,నాయకులు

జనంసాక్షి – చిగురుమామిడి/ ఆగష్టు 10:
దేశానికి స్వాతంత్ర్యo వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరు దేశభక్తి భావన, స్వతంత్ర పోరాట స్ఫూర్తి మేల్కొనేలా కార్యక్రమాలను నిర్వహించాలని ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి,తహశీల్దార్ ముబీన్ అహ్మద్, ఎంపీడీవో నర్సయ్య, ఎస్సై దాస సుధాకర్ అన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం చిగురుమామిడి మండల పోలీస్ స్టేషన్ ఆవరణలో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి మండల అధికారులతో కలిసి సంయుక్తంగా బుధవారం 75 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 15 వరకు జాతీయ జెండాలను ప్రతి ఇంట ఎగరవేయాలి అన్నారు. వజ్రోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించి మహనీయుల చరిత్రను ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నాటి త్యాగాల స్పూర్తి ఫలితంగానే స్వాతంత్య్రం సాధించుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు శ్రీ మూర్తి రమేష్, గోలి బాపురెడ్డి పోలీస్ సిబ్బంది తిరుపతి, అంజయ్య,పరశురామ్,మురళి,పాషా,శ్రీను, ఓదయ్య, కలీం, ఆలి, బిక్షపతి,నాయకులు తదితరులు పాల్గొన్నారు.