వజ్రోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరు పాల్గొనాలి.. వంగర ఎస్సై మౌనిక రెడ్డి
భీమదేవరపల్లి మండలం ఆగస్టు (11) జనంసాక్షి న్యూస్
భీమదేవరపల్లి మండలం వంగర గురుకుల పాఠశాలలో
భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని వంగర ఎస్సై మౌనికరెడ్డి అన్నారు. గురువారం నాడు పివి బాలికల గురుకుల పాఠశాల నుండి పోలీస్ స్టేషన్ వరకు ఫ్రీడం రన్ లో భాగంగా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాడు స్వాతంత్రం కోసం మూడు లక్షల మందికిపైగా ప్రాణాలు త్యాగం చేశారని వారి పోరాట స్ఫూర్తిని నేటితరం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. వజ్రోత్సవ వేల ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసి నాటి సమరయోధులకు ఘనమైన నివాళులర్పించాలని ఆమె కోరారు. అనంతరం పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రజిత, ఉప సర్పంచ్ రాజు, ఎంపీటీసీ కౌసల్య, ఇతర పోలీస్ సిబ్బంది ,గురుకుల పాఠశాల సిబ్బంది స్థానిక నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.